KING JAMES BIBLEవెతుకు

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

కీర్తన 93

అన్ని · కీర్తనవెతుకు

1యెహోవా పరిపాలన చేస్తున్నాడు. ప్రభావం ధరించుకున్నాడు. యెహోవా బలం ధరించాడు, బలాన్ని నడికట్టుగా కట్టుకున్నాడు. లోకం సుస్థిరంగా ఉంది, అది కదలదు.

2ప్రాచీన కాలంనుంచి నీ సింహాసనం సుస్థిరంగా ఉంది. నువ్వు శాశ్వతకాలం ఉన్నావు.

3యెహోవా, మహా సముద్రాలు పైకి లేచాయి, అవి తమ గొంతెత్తాయి, మహా సముద్రాల అలలు ఎగిసిపడి హోరెత్తుతున్నాయి.

4అనేక అలల ఘోషకు మించి, బలమైన సముద్ర తరంగాలను మించి, పైనున్న యెహోవా శక్తిశాలి.

5యెహోవా, నీ శాసనాలు నమ్మదగినవి, పరిశుద్ధత నీ ఇంటికి శాశ్వత అలంకారంగా ఉంది.

Sources and attribution